బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 39.97శాతం పోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బుధవారం నాడు అసెంబ్లీ ఎన్నికల(Bengal Election) రెండో దశ పోలింగ్ ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 39.97శాతం(Bengal Election Polling Percentage) ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, విధ్వంసక చర్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భంగార్‌తో సహా పలు ప్రాంతాల నుండి ఈ ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. నాడియా జిల్లాలోని చప్రాలో గల బూత్ నంబర్ 53 వద్ద, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన దుండగులు ఒక బీజేపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. మొషారెఫ్ మీర్ అని గుర్తించిన ఆ వ్యక్తిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.






