10 March, 2026 | 9:19 PM

బీఎల్‌టీయూలో చేరిన బీడీ ప్యాకర్లు

10-03-2026 06:04 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మండలం భవాణీపేట్‌ గ్రామంలోని దీపక్ బీడీ సెంటర్‌లో పనిచేస్తున్న బీడీ ప్యాకర్లు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘంలో మంగళవారం చేరారు. ఈ కార్యక్రమం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సిద్ది రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగారపు యెల్లయ్య సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా 10 మంది బీడీ ప్యాకర్లు  సీఐటీయుకు అనుబంధంగా ఉన్న తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్‌ను విడిచి బీఎల్టీయులో చేరినట్లు తెలిపారు. చేరిన వారిలో బాల్‌కిషన్, ఖాదిర్, జీవన్, మల్లయ్య, నర్సిములు, సాయిరెడ్డి, రాజం, స్వామి, శ్రీనివాస్, జగదీష్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ప్యాకర్ల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం  అని పేర్కొన్నారు. కార్మికులకు ఎప్పుడైనా సమస్యలు ఎదురైనప్పుడు సంఘం అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. బీడీ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సంఘం చేపడుతున్న పోరాటాలకు ఆకర్షితులై ఈ చేరికలు జరిగాయని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీడీ ప్యాకర్లు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.