5 July, 2026 | 3:27 AM

పైరసీ పట్ల అప్రమత్తంగా ఉండండి

05-07-2026 12:16 AM
  1. కంటెంట్ వ్యాప్తి విషయంలో జాగ్రత్తలు పాటించాలి
  2. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 4(విజయక్రాంతి): టెలిగ్రామ్ ద్వారా పైరసీ సినిమాలు, ఆడియో కంటెంట్ వ్యాప్తి విషయం లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా కేం ద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సి. సెం థిల్ రాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కొత్తగా విడుదలైన చిత్రాలు సహా అనేక పైరసీ సినిమాలు టెలిగ్రామ్‌లోని పబ్లిక్ ఛానెళ్లు, గ్రూపుల ద్వారా అనధి కారికంగా కాపీ, హూస్ట్, స్ట్రీమ్, పంపిణీ, షేర్ చేయబడుతున్నాయి.

ఇలాంటి పైరసీ సిని మా, కాపీరైట్ ఉల్లంఘనకు గురైన ఆడియో కంటెంట్ వ్యాపి వల్ల సృష్టిక ర్తలు, కాపీరైట్ యజమానులు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రసార సంస్థలు, ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురణకర్తలు, ఇతర సంబంధిత వర్గాలకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతోంది. అలాగే కాపీరైట్ చట్టం, సినీమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం నేరంగా పరిగ ణించబడతాయని తెలియజేసింది. కాపీరైట్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన లేదా అలాంటి ఉల్లంఘనకు సహకరించిన వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది. అ లాగే పైరసీ కాపీలను ప్రజల ముందు లాభాపేక్షతో ప్రదర్శించడం లేదా అలాంటి విని యోగానికి సహకరించడం నిషేధించబడింది.

మధ్యవర్తి ప్లాట్‌ఫారమ్‌లలో హూస్ట్ చే యబడిన లేదా ప్రదర్శించబడుతున్న పైరసీ కాపీలను తొలగించడం లేదనా వాటికి యా క్సెస్ నిలిపివేయడం కోసం తగిన చర్యలు తీసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్‌కు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పైరసీ కంటెంట్‌ను నిరోధించడం, అలాంటి కంటెంట్‌ను గుర్తించడం, నివేదించడం, యా క్సెస్ నిలిపివేయడం, తొలగించడానికి ప్రస్తు త వ్యవస్థలను బలోపేతం చేయడం, కాపీరైట్ ఫిర్యాదుల స్వీకరణ, త్వరిత పరిష్కారం కోసం సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఒలగించిన కంటెంట్ మ ళ్లీ అప్‌లోడ్ కాకుండా చర్యలు తీసుకోవడం, చట్ట అమలు సంస్థలతో సమన్వయ కోసం సమర్ధవంతమైన నోడల్ కాంటాక్ట్‌ను నిర్వహించడం తదితర ఆదేశాలను జారీ చేసింది.

పదిహేను రోజులలో యాక్షన్ టెకెన్ రిపోర్ట్ సమర్పించాలని టెలిగ్రామ్ సంస్థకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పైరసీ సినిమా లు, కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన ఆ డియో కంటెంట్ వ్యాప్తిని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిసోందని పేర్కొంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వల్ల తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వ సంయుక్త కార్యద ర్వి సి. సెంథిల్ రాజన్ హెచ్చరించారు.