1 April, 2026 | 12:15 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలి

01-04-2026 12:01 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ 

దేవరకొండ, మార్చి 31 : అసెంబ్లీ సమావేశాల్లో బిసి సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలని సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా తాము అధికారంలోకి రాగానే మహాత్మ జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ చట్టం చేస్తామని,

ప్రతి ఆర్థిక సంవత్సరంలో బీసీల సంక్షేమానికి 20వేల కోట్ల రూపాయలు కేటాయించి ఐదు సంవత్సరాలకుగాను ఒక లక్ష కోట్లు బీసీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో  పున్న వెంకటేష్ నేత,పున్న బిక్షమయ్య, జక్కుల అంజి యాదవ్,బొమ్ము శ్రీనివాస్ యాదవ్, పొలమోని శేఖర్ గౌడ్, నట్వా సుధాకర్, చెరుకు అంజి గౌడ్,వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.