calender_icon.png 12 February, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సింహగర్జనను విజయవంతం చేయాలి

12-02-2026 05:34:56 PM

– తీగల అశోక్

మునుగోడు,(విజయక్రాంతి): 22వ తేదీన జరిగే బిసి సింహ గర్జనను విజయవంతం చేయాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు తీగల అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి బీసీ సింహగర్జన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు మునుగోడులో వాల్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీసీలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. బీసీ కులాల కార్పొరేషన్ నిధులను పూర్తిగా విడుదల చేయాలని, సమగ్ర కులగణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు జిట్టాగోని కృష్ణకుమార్, నెల్లికంటి రాఘవేంద్ర, నిమ్మల నాగార్జున, మునుగాల శ్రీనివాస్ చారి, బోయపల్లి స్వామి గౌడ్ ఉన్నారు.