సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు
20-05-2026 04:25 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (#MCRHRD)లోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డి వైస్ చైర్‌పర్సన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషా రాణి ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి.సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.






