భక్తిశ్రద్ధలతో కొనసాగిన శబరిమాత ఆలయ వార్షికోత్సవం
బోథ్(విజయక్రాంతి): మండలంలోని పొచ్చెర గ్రామంలో శబరిమల ఆలయ 15వ వార్షికోత్సవ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రారంభమైన శబరిమాత పల్లకి ఊరేగింపు తో పాటు భజన కార్యక్రమం నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శబరిమాత భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ భక్తి పారవస్యంతో. ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం శబరిమాత ఆశ్రమంలో ఫాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాంత్ ఆర్కెస్ట్రా బృందం వారు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాదపూజ కార్యక్రమాన్ని శబరిమాత భక్తుడైన ఎడమల ధర్మారెడ్డి సమక్షంలో కొనసాగింది. కౌటబి గ్రామానికి చెందిన బి ప్రభాకర్ రెడ్డి తోపాటు పలువురు భక్తులు గీతాలను ఆలపించారు. ఆశ్రమం వారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.






