6 March, 2026 | 7:13 AM

శ్రీరామ నవమికి బ్యాండ్ మేళం

06-03-2026 12:00 AM

‘కోర్ట్’ సినిమా జోడీ హర్ష్ రోష న్, శ్రీదేవి ఇప్పుడు ‘బ్యాండ్‌మేళం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ సినిమాను నిర్మించారు.

సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీరామనవమి సందర్భంగా సినీప్రియులకు వినో దం పంచనుంది. మార్చి 26న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; డీవోపీ: సతీష్ ముత్యాల; ఆర్ట్: నార్ని శ్రీనివాస్; స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు.