30 May, 2026 | 2:48 AM

సన్ గ్లాసెస్‌పై నిషేధం

30-05-2026 01:17 AM

ప్లేయర్స్‌కు బీసీసీఐ ఆదేశాలు

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ముంబై, మే 29: ఐపీఎల్ 19వ సీజన్ ముగియబోతున్న వేళ బీసీసీఐ కీలక నిర్ణ యం తీసుకుంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కొత్త రూల్స్ విధించింది. బీసీసీఐ నిఘా వ్యవస్థ యాంటీ కరప్షన్ యూనిట్ తాజాగా స్మార్ట్ సన్ గ్లాసెస్ వినియోగింపై నిషేధం విధించింది. బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు పంపిన సర్క్యులర్లో కొన్ని కంపెనీలు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌కు స్మార్ట్ గాగుల్స్‌ను మార్కెట్ చేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపింది.

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో లైవ్ స్ట్రీమింగ్, మెసెజ్లు పంపడం- రిసీవ్ చేసుకోవం.. ఆడి యో వీడియో కాల్స్ వంటి అధునాతన క మ్యూనికేషన్ ఫీచర్లు ఉన్నాయని బీసీసీఐ పేర్కొంది. మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా పనిచేసే ఈ డివైజ్‌లను కమ్యూనికేషన్ డివై జ్‌లను కమ్యూనికేషన్ డివైజ్, ఆడియో - వీడియో డివైజ్ కింద పరిగిణిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ కారణంతోనే వీటిని బీసీ సీఐ పూర్తిగా నిషేధించింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఉన్న రోజు ఆటగాళ్లు, సపో ర్ట్ స్టాఫ్ తమ మొబైల్స్, స్మార్ట్ వాచ్లతో పా టు స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా సెక్యూరిటీ వద్ద అప్పగించాల్సిందే.

ఒకవేళ అలా అప్పగించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కూ డా బీసీసీఐ హెచ్చరించింది. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన లీగుల్లో ఐపీఎల్ ఒకటనీ, ఆట అభివృద్ధితోపాటు ప్లేయర్ల ప్రైవసీకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే సపోర్ట్ స్టాఫ్ మ్యాచ్ లైవ్ సమయంలో మొబైల్ ఫోన్‌తో కనిపించడం పెద్ద వివాదమైంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ మ్యాచ్ సమయంలో డగౌట్లో మొ బైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు.

దీంతో అతడికి రూ.లక్ష జరిమానా విధించి హెచ్చరించారు. ఐపీఎల్ 2026లో హనీ ట్రాప్ వార్తలు రావడంతో బీసీసీఐ రూల్స్ ను కఠినతరం చేసింది. అనుమతి లేకుండా రాత్రిళ్లు బయటకు వెళ్లడాన్ని కూడా నిషేధించింది. భద్రతా కారణాలతో పాటు హనీ ట్రాప్ భయాల దృష్ట్యా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్ గదుల్లో గెస్ట్‌లను ఆహ్వానించడాన్ని కూడా బీసీసీఐ నిలిపివేసింది. ఎవరి నైనా కలవాలనుకున్నా బహిరంగ ప్రదేశాల్లోనే సమావేశాలు ఉండాలని స్పష్టం చేసిం ది. మేనేజర్ అనుమతి లేకుండా కుటుంబసభ్యులు లేదా స్నేహితులను కలిసేందుకు కూ డా వీలులేదని ఆదేశాలిచ్చింది.