పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు
28-04-2026 01:15 PM
హైదరాబాద్: మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad farmhouse case) కేసులో రోహిత్ రెడ్డికి హైకోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారంలో ఒకరోజు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావలని కండిషన్ పెట్టింది. పాస్ పోర్టును పోలీసులకు సరెండర్ చేయాలని రోహిత్ రెడ్డికి(Pilot Rohit Reddy) ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు సూచించింది. రోహిత్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలుతో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.






