28 April, 2026 | 3:48 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా BRS నాయకులకు KTR దిశానిర్దేశం

28-04-2026 02:02 PM

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal district) బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమావేశం అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్య  నమోదు పై చర్చ జరిగింది. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ కార్పొరేషన్(Warangal Corporation) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో స్థితిగతులపై చర్చించారు. సర్(Special Intensive Revisionప్రక్రియలో పార్టీ తరుపున పోషించాల్సిన పాత్రపై సూచనలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పార్టీ నేతలను ఆదేశించారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఒక్కరు కూడా ఓటు కోల్పోకుండా చూడాలని నాయకులకు కేటీఆర్ సూచించారు.