మహబూబాబాద్‌లో దారుణం.. కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య
28-04-2026 01:02 PM
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ప్రాణాలు పోయాయి. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరులో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, తర్వాత తండ్రి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరు కుమారులు విలాస్(5), వికేష్(3)కు ఉరి వేసిన అనంతరం తండ్రి షావలి(35) తొర్రూరు మార్కెట్ ఎదురుగా చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతులను మహబూబాబాద్ జిల్లా అమ్మ పురం వాసులుగా గుర్తించారు. నిన్న భార్యతో గొడవపడి పిల్లలను తీసుకుని షావలి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






