calender_icon.png 19 February, 2026 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో బహుజన రాజకీయ సునామీ

19-02-2026 02:34:39 AM

61 శాతం పీఠాలు బీసీలకే : దాసు సురేశ్

హైదరాబాద్ , సిటీబ్యూరో ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయని, బీసీల రాజకీయ చైతన్యానికి ఈ ఫలితాలే సజీవ సాక్ష్యమని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ అభివర్ణించారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాల్లో బీసీలు ఏకంగా 61 శాతం మేర విజయం సాధించి విజయ దుందుభి మోగించడం మారుతున్న రాజకీయ వాతావరణానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఫలితాలపై తన విశ్లేషణను పంచుకున్నారు. రాబోయే గ్రేటర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.