27 July, 2026 | 7:51 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

కంచర్లలో బడిబాట

09-06-2026 01:29 AM

భిక్కనూర్, జూన్ 8(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయు రాలు లత నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.