17 March, 2026 | 4:42 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతం

17-03-2026 12:37 AM

మఠంపల్లి, మార్చి 16 : మండలంలోని బక్కమంతులగూడెం సెక్టార్ పరిధిలోని కొత్త దొనబండ తండా అంగన్వాడి టీచర్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో సోమవారం గర్భిణీకి శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్త దొనబండ తండా సర్పంచ్ బాణోతు అరుణా దేశ్ పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాల్లో అన్నప్రసన్న, అక్షరభ్యాసం,

శ్రీమంతం, పుట్టిన రోజు వేడుకలు లాంటి కార్యక్రమాలను అంగన్వాడి సెంటర్లో నిర్వహించుకోవాలన్నారు. గ్రామ ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాల కు సహకరించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి సూచించారు.ఈ కార్యక్రమంలో కాల్వపల్లి తండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతసక్రు నాయక్, కార్యదర్శి నరేష్, డీలర్ మాలోతు లక్ష్మి,అంగన్వాడీ ఆయాలు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.