2 September, 2026 | 9:37 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

సామాజిక సమానత్వ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్

07-07-2026 | 12:00am

గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ పావనీ వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): సామాజిక సమానత్వం కోసం జీవించిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ‘భారతదేశ మాజీ ఉప ప్రధాని, రక్షణ శాఖ మంత్రి, గొప్ప సంఘసేవకులు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా  అరుంధతి నగర్ బస్తీ లోనీ ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ కులం, మతం, పేద-గొప్ప అనే తేడాలు లేకుండా సమాజ సేవ చేసిన ఆయన నిజమైన ‘బాబుజీ‘. హరిత విప్లవానికి, దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, ఎం. ఉమేష్, ఆనంద్ రావు, శ్రీనివాస్ యాదవ్, మహమూద్, లక్ష్మణ్ యాదవ్, సాయి కుమార్, సత్యెందర్, జిడి. రాజు, సాయి గౌడ్, శ్యామ్, సంయుక్త రాణి, పూర్ణ దేవి స్థానికులు  పాల్గొన్నారు.

బాలాపూర్‌లో..

బడంగ్‌పేట్, జూలై 6: విజయ కాంతి జిహెచ్‌ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం బాలాపూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రావ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావ్ అని, ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు కొనియాడారు. యువతీ యువకులంతా మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ గ్రామ మాదిగ కుల పెద్దలు, బాబు జగ్జీవన్ రామ్ సంఘం సభ్యులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.