రైస్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఐఎన్టీయూసీ నేషనల్ సెక్రటరీ బాబర్ సలీం పాషా
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాంతంలోని రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐఎన్టీయూసీ నేషనల్ సెక్రటరీ బాబర్ సలీం పాషా హామీ ఇచ్చారు. మంగళవారం రామగుండంలోని ఎన్టీపీసీలో ఆయనను ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నీరటి శంకర్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ రైస్ మిల్ కార్మిక నాయకులు కలిసి కార్మికుల సమస్యలపై రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న తక్కువ జీతభత్యాలు, అధిక పని గంటలు, పని ఎదురవుతున్న ఇబ్బందులు, కార్మిక హక్కుల అమలు తదితర సమస్యలను బాబర్ సలీం పాషా దృష్టికి కార్మిక నాయకులు తీసుకెళ్లారు.
కొన్ని సంవత్సరాలుగా రైస్ మిల్లుల్లో కార్మికులు శ్రమిస్తున్నప్పటికీ, వారి శ్రమకు తగిన వేతనాలు, సౌకర్యాలు అందడం లేదని వివరించారు.ఈ సందర్భంగా బాబర్ సలీం పాషా సానుకూలంగా స్పందించి రైస్మిల్ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐ ఎన్ టి యు సి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం పట్ల, రైస్ మిల్ కార్మిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన రైస్ మిల్ కార్మిక నాయకులు పురం హరికిషన్ రావు వేగోళం శంకర్ గౌడ్, చొప్పరి శ్రీనివాస్, పోషవేణి బాలకిషన్, రెడ్డి ఐలయ్య, చొప్పరి వెంకటేష్, కంకణాల మహేష్,రైస్ మిల్ కార్మిక నాయకులు పాల్గొన్నారు.






