25 August, 2026 | 6:55 PM

కేసీఆర్‌ వల్లే సన్నబియ్యం పంపిణీ

25-08-2026 04:30 PM

గజ్వేల్, ఆగస్టు 25, మాజీ సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం వల్లే ప్రస్తుతం ప్రభుత్వం రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసే స్థాయికి వచ్చిందని 11వ వార్డు కౌన్సిలర్‌ భవాని కరుణాకర్‌, లక్ష్మాపూర్‌ మాజీ సర్పంచ్‌ కొలిచెలిమి స్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించడంతో పెద్దఎత్తున పంటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. 11వ వార్డు బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రేషన్‌ డీలర్‌, గ్రామ పెద్దలు అమరేందర్‌ శర్మ, పద్మనాభ శర్మ, మాజీ సర్పంచ్‌ మద్దూరి రాములు తదితరులు పాల్గొన్నారు.