అనుభవాధారిత విద్యను అందించడమే లక్ష్యం
- వైస్ ఛాన్స్‌లర్ వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు
- యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పలు కోర్సులు ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ), యూజీసీ 2(ఎఫ్) గుర్తింపు పొందిన రాష్ట్ర విశ్వవిద్యాలయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాన్స్‌ల ర్‌గా ఉన్న ఈ విశ్వవిద్యాలయం, పరిశ్రమలతో అనుసంధానిత అండర్ గ్రాడ్యూయేట్ కోర్సులు, డిజిటల్ లెర్నింగ్ యూనివర్స్‌ను బుధవారం గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని సరంగ హాల్‌లో ఘనం గా ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి వైస్ చాన్సలర్ వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు అ ధ్యక్షత వహించగా, వైఎస్‌ఐయూ రిజిస్ట్రార్ ఇన్‌చార్జ్ డాక్టర్ జొన్నలగడ్డ సుధాకర్, ఏఐజీ ఆసుపత్రుల డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ గ్రూప్ కెప్టెన్ (రిటైర్డ్) డాక్టర్ మౌనిక, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హెచ్‌ఆర్ డైరెక్టర్ సీ సతీష్ కుమార్, ట్యుటోరియల్స్ పాయింట్‌కు చెందిన అనుభవ్ మహేశ్వరి పాల్గొని ప్రోగ్రామ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైస్ చాన్సలర్ సుబ్బారావు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సుల ను రూపకల్పన చేస్తున్నామన్నారు.
అకాడమిక్ విద్య, వాస్తవ ప్రపంచ అవసరాల మ ధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే అనుభవాధారిత విద్యను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన కోర్సుల గురించి వివరించుతూ, బీటెక్ ఇన్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ ప్రోగ్రామ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెటిరో, భారత్ బయోటెక్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యంలో రూపొందించినట్లు తెలిపారు.ఈ కోర్సులో మొదటి సెమిస్టర్‌లో మాత్రమే క్లాస్‌రూమ్ శిక్షణ ఉండగా, మిగిలిన సెమిస్టర్లలో భాగస్వామ్య కంపెనీల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అంది స్తారని చెప్పారు.
చివరి సంవత్సరం పూర్తిగా ఇంటర్న్‌షిప్‌కు కేటాయించి, ప్రపంచ స్థాయి నిపుణుల చేత శిక్షణ అందిస్తామని, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిం చే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపా రు. అలాగే, ఏఐజీ ఆసుపత్రులతో భాగస్వామ్యంలో ప్రారంభించిన బీఎస్సీ కార్డియోవా స్కులర్ సైన్సెస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ, విద్యార్థులు ఆసుపత్రి వాతావరణం లోనే నేరుగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందుతారని చెప్పారు.
ఈ శిక్షణతో దేశం లో ఎక్కడైనా ఉద్యోగం పొందగల నైపుణ్యాలు విద్యార్థులకు అందుతాయని తెలిపా రు. తెలంగాణ యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కోర్సు లను రూపొందించామని, ముఖ్యంగా ఎంపీ సీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా, ట్యుటోరియల్స్ పాయింట్ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ యూనివర్స్‌ను కూడా ప్రా రంభించారు.
నాణ్యమైన కంటెంట్‌ను అందించడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించడం తమ లక్ష్యమని చెప్పారు. ఈ కోర్సుల ఫీజు నిర్మా ణం కూడా అందుబాటులో ఉండే విధంగా రూపొందించామని, బీటెక్ కోర్సుకు సంవత్సరానికి సుమారు రూ.1.75 లక్షలు, బీఎస్సీ కోర్సుకు సంవత్సరానికి సుమారు రూ.1 లక్షగా నిర్ణయించినట్లు తెలిపారు. కోర్సులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఎంట్రెన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.




