30 April, 2026 | 6:53 PM

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

30-04-2026 04:59 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేటలోని రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం అనే అంశంపై మంగపేట మండల వ్యవసాయ అధికారి నేదునూరి చేరాలు ఆధ్వర్యంలో గురువారం రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత 15 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయ ద్వారా వివిధ పంటలు పండిస్తూ అనుభవం గడించిన పులి సంపత్ ప్రకృతి వ్యవసాయం విషయంపై  సదస్సుకు హాజరైన రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల వ్యవసాయ అధికారి నేదునూరి చేరాలు, ఏఈఓలు ఆక మహేష్, గాయత్రి, ఉద్యానవన శాఖ అధికారులు , ఆత్మ కమిటీ చైర్మన్,  స్థానిక రైతులు పాల్గొన్నారు.