30 April, 2026 | 6:56 PM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

30-04-2026 04:58 PM

సిర్గాపూర్ ఏప్రిల్ 30(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా ఇందిరమ్మ ఇండ్లను పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ళు లబ్దిదారు ఐన తమ్మలి రమ్య భర్త తమ్మలి వీరేశం నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి  నూతన గృహ ప్రవేశం నిర్వహించారు. నూతన గృహ యజమానులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్  పాల్గొని గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు శుభసూచకమని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఉప సర్పంచ్ భిక్షపతి యాదవ్, పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి, ఏఈ ఇందు, వార్డు సభ్యులు లింగం, రాజాగౌడ్, మహమ్మద్ హుస్సేన్, జమీల్, సుభాష్ సేట్ తదితరులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.