రైతులకు అవగాహన కార్యక్రమం
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామపంచాయతీ వద్ద రైతులకు సోమవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పై సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి ఆచరిత మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం పైన మొగ్గు చూపాలని తెలిపారు రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడుతున్నారని రసాయన వీరుల వాడకాన్ని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని తెలిపారు.
పశువుల ఎరువు పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని భూమిలో కలియ దున్నలని తెలిపారు అదేవిధంగా ఏదైనా పురుగు గాని తెగులుగానీ ఆశించినచో పురుగుమందులు వాడకుండా వేప కషాయము జీవామృతము పంటల పైన పిచికారి చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా రైతులు భూసార పరీక్షలు చేయించుకొని దాని ఆధారంగా రసాయన ఎరువులు వాడుకోవాలని తెలిపారు అదేవిధంగా రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులు అందజేసారు ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ బుజ్జన్న గారి అనసూయ గంగారెడ్డి మాజీ సర్పంచులు మహమ్మద్ అలీ, గోలి వసంతం, కిష్టారెడ్డి ఉప సర్పంచ్ గంగమని శ్యామ్ రావు రైతులు రాములు సంజీవరెడ్డి, నరసింహారెడ్డి ,సాయ గౌడ్, ఏఈఓ రాజా గౌడ్, సి ఆర్ పి లు మమత ,యాదమ్మ, పాల్గొన్నారు.




