27 April, 2026 | 7:19 PM

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

27-04-2026 05:17 PM

డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కళాభారతి ఆడిటోరియం లో మహిళా సంఘాల సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎమ్ఈ పథకాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని నగర డిప్యూటీ మేయర్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు  పిలుపునిచ్చారు.  ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియపై  అవగాహన కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావు  పాల్గొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎమ్ఈ పథకం ద్వారా అనేక రాయితీలు కల్పిస్తోంది. పథకం కింద రూ. 10 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 35% వరకు సబ్సిడీ అందిస్తుందని ఆయన వివరించారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు బండారి వేణు, సాధవేని సుజాత-శ్రీనివాస్,  అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.