కొత్తపల్లి పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు
08-07-2026 07:14 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయం లో మాజీ కౌన్సిలర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గున్నాల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గున్నాల రమేష్ మాట్లాడుతూ... వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ 108, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోయిన గొప్ప మనిషి అని స్మరించుకున్నారు. తదుపరి కేక్ కట్ చేసి, నివాళులర్పించడం జరిగింది.






