జనగణనపై అవగాహన
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్ మే 8 (విజయ క్రాంతి)దేశాభివృద్ధికి కీలకమైన జనగణన ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్మల్ పట్టణంలో భారీ మారథాన్ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ఈ మారథాన్ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, దేశ ప్రగతి, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి జనగణన అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రక్రియ అని తెలిపారు. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక చేపడుతుందని వివరించారు.
జనగణన -2027లో భాగంగా ప్రతి పౌరుడు స్వీయ గణన (Self-Enumeration) విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవాలని కోరారు. అవగాహన లేని వారికి ఇతరులు సహకరించాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సి పి ఓ జీవరత్నం, డి వై ఎస్శ్రీ ఓ కాంత్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న, ఎల్డీఎం రామ్ గోపాల్, డీపీఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ పీజీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






