8 May, 2026 | 4:04 PM

రైతులకు పంట సాగు పై అవగాహన

08-05-2026 03:12 PM

వాంకిడి, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఖిరీడీ గ్రామములో ' రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు' రైతులకు పంట సాగు పై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   ప్రొఫెసర్ అనురాధ,సౌజన్య  పాల్గొని, వారు మాట్లడుతూ రైతులు యూరియా వినియోగం తగ్గించాలని, పంట మార్పిడి చేయాలనీ, పచ్చిరొట్ట ఎరువులు వినియోగం పెంచాలని, పంట వ్యర్థాలను కాల్చకుండా వేసవి దుక్కులో కలియ దున్నలనీ తెలియచేశారు. నిషేధిత మందులు, నీటి యాజమాన్యం, కూరగాయ పంటలలో కోతల మధ్య పిచికారి విధానం మరియు నేలలో సేంద్రీయ పదార్థాలు పెంచడం వంటి రైతులకు అవగాహ న కల్పించారు.. ఈ కార్యక్రమం లో సి ఈ ఓ ఒమాజీ, AEO శంకర్, అరవింద్, ఖిర్డీ సర్పంచ్ అమృత, ఉప సర్పంచ్ సాగర్, గ్రామ పాటేల్ సంతోష్, రైతులు పాల్గొన్నారు.