27 May, 2026 | 3:23 AM

బాలికలకు సామాజిక అంశాలపై అవగాహన

27-05-2026 12:34 AM

చిన్నంబావి, మే 26: మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో కిషోర్ బాలికల అభివృద్ధి సమ్మర్ క్యాంప్ మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించారు. కౌమార దశలో ఉన్న బాలబాలికల వ్యక్తిత్వ వికాసము, ఆరోగ్య పరిరక్షణ, స్వీయ అవగాహన పెంపు లక్ష్యంతో పాటుగా  విద్యా ప్రాముఖ్యత, పోషకాహారం,ఫోక్సో చట్టం మరియు బాల్య వివాహాలను నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు మండల మహిళా అధ్యక్షురాలు ఇందిర అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1098 హెల్ప్ లైన్ నెంబర్లను వినియోగించుకోవాలని స్థానిక ఎస్త్స్ర రామన్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అనిల్ కుమార్, నరేందర్, గౌతమి, దేవేందర్,శ్యామల, మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు.