29 April, 2026 | 9:47 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

29-04-2026 08:13 PM

- ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు

గుండాల,(విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి నివారించుకోవాలని ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు బుధవారం విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైంఫై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, మహిళలు, యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని హితవు పలికారు. సమాజంలో కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని, నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండి నష్టానికి గురి కావద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ హరికుమారి, సీడీపీఓ మంగతాయారు, సీఐ తిరుపతి, సూపర్వైజర్లు పుష్ప, అన్నపూర్ణ, కోఆర్డినేటర్ సందీప్, సూపర్వైజర్ లలిత, పోలీస్ సిబ్బంది బట్టు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.