ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లలో పాటు ఒక కానిస్టేబుళ్లు సస్పెండ్
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, డబ్బు ఇవ్వని వారి ఇంటిపై దాడికి పాల్పడినందుకుగాను ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యం. యాదగిరి సస్పెండ్ కాగా, హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి నైట్ ఇంచార్జి విధులు నిర్వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ టి. రాములు సస్పెండ్ అయ్యారు. అలాగే స్టేషన్ అధికారి ఇచ్చిన ఆదేశాలను అతిక్రమిస్తున్నందుకు గాను చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ సతీష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.






