calender_icon.png 21 February, 2026 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయవ్యాధి నివారణపై అవగాహన

21-02-2026 08:33:10 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని తిమ్మాపురం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం నిక్షయ శివిర్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధి లక్షణాలు, సంక్రమించే విధానం, నివారణ చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 120 మందికి ఎక్స్ రే పరీక్షలు జరిపారు. పోషకాహార లోపంతో బరువు తక్కువగా ఉన్న 10మందిని గుర్తించి వారి నుండి కళ్లే(తెమడ) నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం సీబీఎన్ఏఏటీ ల్యాబ్ కు పంపారు.

తెమడ పరీక్షలో క్షయవ్యాధి నిర్ధారణ అయితే వారికి 6 నెలలు ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేసిన మందులను పీహెచ్సీ అర్వపల్లిలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్, సర్పంచ్ బొడ్డు ఇందిరాసోమరాజు, సీహెచ్ఓ బిచ్చునాయక్, టీబీ నోడల్ పర్సన్ కుంభం వీరయ్య, కో-ఆర్డినేటర్ ప్రసాద్, ఎక్స్ రే టెక్నీషియన్ మాదవరెడ్డి, ఎంఎల్ హెచ్పీ వాణి, గౌతమి, హెల్త్ అసిస్టెంట్ దుర్గమ్మ, ఆశాలు సుధా, స్వరూప, సైదమ్మ, స్రవంతి, పుష్పలత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.