11 August, 2026 | 10:32 PM

దక్షిణ భారతదేశానికి వస్తోన్న ట్రంప్ టవర్స్

11-08-2026 09:08 PM

హైదరాబాద్, 11 ఆగస్టు 2026 : భారతదేశంలో ప్రతిష్ఠాత్మక లగ్జరీ ప్రాజెక్టుల అభివృద్ధిలో అగ్రగామి సంస్థ అయిన ట్రైబెకా డెవలపర్స్, కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ రోడ్‌లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విలాసవంతమైన నివాస ప్రాజెక్ట్ అయిన ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌ను ప్రారంభించనున్నట్లు ఈరోజు ప్రకటించింది.ముంబై, పూణే, గూర్గావ్, నోయిడా మరియు కోల్‌కతాలలో ట్రంప్-బ్రాండెడ్ ప్రాజెక్ట్‌లతో భారతదేశంలో పన్నెండేళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్న తర్వాత, ట్రంప్ బ్రాండ్ ఇప్పుడు ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌ ద్వారా దక్షిణ భారతదేశంలో తమ తొలి అడుగు వేస్తోంది.

ఐరా రియల్టీ సహకారంతో ట్రైబెకా డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన , వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటైన ఈ ప్రాంతానికి, ట్రంప్ బ్రాండ్ కు ప్రత్యేకమైన విలాసవంతమైన ప్రమాణాలు, అత్యున్నతమైన డిజైన్, ప్రపంచ స్థాయి సేవా ప్రమాణాలను తీసుకురానున్నారు.

ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌లో సుమారు 800 అడుగుల ఎత్తులో రెండు 65-అంతస్తుల టవర్లు ఉంటాయి. ఇవి 28వ అంతస్తు వద్ద ఒక అద్భుతమైన సస్పెండెడ్ స్కై బ్రిడ్జ్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ బ్రిడ్జ్ పైన ట్రంప్ క్లబ్ ఉంటుంది. ఇది రెండు టవర్ల నూ కలుపుతూ, అన్ని వైపులా నగర అందాలను వీక్షించేందుకు వీలుగా ఉండేలా అందంగా తీర్చిదిద్దబడిన ఒక క్లబ్ ఫ్లోర్ ఇది .ఈ ప్రాజెక్ట్‌లో 450కి పైగా విలాసవంతమైన నివాసాలు ఉండనున్నాయి. వీటిలో 3.5, 4-బీహెచ్‌కే ఇళ్లతో పాటు డబుల్‌-హైట్‌ సీలింగ్‌లతో ప్రత్యేకంగా రూపొందించిన సింప్లెక్స్‌ రెసిడెన్సీలు కూడా ఉంటాయి. ప్రతి ఇంటిలో ప్రైవేట్ లిఫ్ట్ లాబీ మరియు నేల నుండి పైకప్పు వరకు గాజు కిటికీలు ఉంటాయి, అలాగే అందంగా తీర్చిదిద్దిన పోడియం అంతటా అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి.

ట్రంప్ టవర్స్ హైదరాబాద్ తమ రెరా రిజిస్ట్రేషన్‌ను పొందింది. ప్రస్తుతం ఎక్స్‌ప్రెషన్స్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (EOI) స్వీకరణ ప్రారంభమైంది. ముందుగా ఆసక్తి వ్యక్తం చేసి నమోదు చేసుకున్న వారికి, ప్రాజెక్ట్‌ అధికారిక విక్రయాలు ప్రారంభమయ్యే ముందే ప్రాధాన్యత క్రమంలో యూనిట్ల కేటాయింపునకు అవకాశం లభించనుంది.ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ మాట్లాడుతూ “ప్రపంచంలోనే అత్యంత ఉత్తేజకరమైన లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా ఇండియా కొనసాగుతోంది. ట్రంప్ బ్రాండ్‌ను మొదటిసారిగా హైదరాబాద్‌కు తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ట్రైబెకాతో మరోసారి కలిసి పనిచేయడానికి మేము సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో మరో అసాధారణమైన ట్రంప్-బ్రాండెడ్ ప్రాజెక్ట్‌ను అందించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.