21 July, 2026 | 8:14 PM

Breaking News

చిట్యాలలో కోతులు, వీధికుక్కల సమస్యపై బీఆర్ఎస్ ధర్నా   •   రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి   •   సర్ ప్రక్రియను పరిశీలించిన టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా సంజీవ్ నాయక్   •   విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు రైతుల వినతి   •   అక్రమ ఇసుక నిల్వలు సీజ్   •   రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   •   బిజెపి పోరాటం వల్లే హౌసింగ్ బోర్డు రోడ్డుకు నిధులు   •   పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత   •   ప్రజలకు కనీస వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం   •   మహిళా సంఘాలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తాం   •  

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

21-11-2025 12:00 AM

ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య

నారాయణపేట క్రైమ్, నవంబర్ 20 : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ... ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా సరైన పత్రాలు (లైసెన్స్, RC, ఇన్సూరెన్స్ మొదలైనవి) కలిగి ఉండాలని, వాహనాలలో అధిక సంఖ్యలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించు కోవద్దని సూచించారు.

ఎవరైనా ప్రయాణికులు తమ వస్తువులు బ్యాగ్ లు, ఇతర వస్తువులు వాహనంలో మరిచిపోయినట్లయితే, నిజాయితీగా వాటిని తిరిగి అందించి నీతిని పాటించాలని తెలిపారు.  ఆటోలను ఒక క్రమ పద్ధతిలో పార్క్ చేయాలనీ, రాష్ డ్రైవింగ్ చేయరాదని, ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భద్రత, సౌక ర్యం కల్పించడంలో ఆటో డ్రైవర్లు సహకరించాలని ఎస్త్స్ర కోరారు.