13 May, 2026 | 2:11 AM

జలాల్‌పూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

13-05-2026 12:00 AM

పుస్తె మట్టలు వితరణ వేసిన సుదర్శన్

నాగిరెడ్డిపేట్,మే 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్పూర్ గ్రామంలో  రేణుక ఎల్లమ్మ జమదగ్ని ప్రాణ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంను ప్రత్యేకంగా పచ్చని తోరణాలతో అందంగా అలంకరించారు.ఉదయం నుండి భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

శ్రీ రేణుక ఎల్లమ్మ నామస్మరణలతో ఆలయం ప్రాంగణాలు మారుమోగాయి.పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని ప్రాణ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం సందర్భంగా పెద్ద ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆవసుల సుదర్శన్ అమ్మవారికి పూస్తే మట్టెలు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,వార్డ్ మెంబర్లు,మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి,టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీగారి సుభాన్ రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.