11 June, 2026 | 4:33 AM

పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలి

11-06-2026 12:00 AM

మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ 

శంకర్‌పల్లి, జూన్ 10 (విజయక్రాంతి): ప్రజలు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని శంకర్ పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 2,3,11వార్డులల్లో  సభలను నిర్వహించారు. ప్రభుత్వం వార్డులలోని సమస్యల పరిష్కారానికి 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.ప్రజలు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వార్డులలో కి వస్తున్న చెత్త బండి వారికి తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని తెలిపారు.

వార్డులలో నీటి సమస్య లేకుండా అధికారులు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు మురుగు కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు సంధ్యారాణి అశోక్ కుమార్, గుండా గిరిజా చంద్రశేఖర్, పైముదా బేగం  మున్సిపల్ కమిషనర్ యోగేష్, తదితరులు పాల్గొన్నారు.