తొలి రోజు టెన్త్ పరీక్షకు 99% హాజరు
కూకట్‌పల్లిలో అదే స్కూళ్లో పరీక్ష రాసిన 80 మంది విద్యార్థులు
జంబ్లింగ్ విధానంలోనే సెంటర్ కేటాయించామన్న అధికారులు
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు ప్రారంభమ య్యాయి. శనివారం ఫస్ట్ లాంగ్వెజ్ పరీక్షను విద్యార్థులు రాశారు. 5,17,197 మంది రెగ్యులర్ విద్యార్థులకు గానూ 5,15,374 (99.65 శాతం) మంది పరీక్షకు హాజరుకాగా, 1823 మంది గైర్హాజరయ్యారు. గతంలో ఫెయిల్ అయిన (ప్రైవేట్) 786 మంది విద్యార్థులకుగానూ 626 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గానూ ఖమ్మం జిల్లాలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్వి జిలేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు శ్రీహరి తెలిపారు. తొలి రోజు పదో తరగతి పరీక్ష ప్రశాం తంగా జరిగినట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ కూకట్‌పల్లి న్యూ ఎరా స్కూల్‌లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇలా ఒకే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే సెంటర్‌ను కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విద్యాశాఖ అధికారులు, మేడ్చల్ మల్కాజ్‌గిరి డీఈవో వివ రణ ఇస్తూ ఈ జోన్‌లో మొత్తం నాలుగు సెంటర్లను ఏర్పాటు చేశామని, మొత్తం 13 పాఠశాలలకు చెందిన 857 మంది విద్యార్థులను ఆ సెంటర్లకు కేటాయించినట్లు తెలిపారు.
జంబ్లింగ్ విధానంలో న్యూ ఎరా పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులు ఇదే పాఠశాలకు కేటాయించబడ్డారన్నారు. అయి తే విద్యార్థులను ఒకే చోట కాకుండా జం బ్లింగ్ పద్ధతిలో సాఫ్ట్ వేర్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ కేంద్రం లో ఈ పాఠశాల సిబ్బందిని కాకుండా పూర్తి గా ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ సి బ్బందిని విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలను పూర్తి పార దర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.




