7 July, 2026 | 2:30 AM

జువెల్లరీ షాపులో చోరీకి యత్నం

07-07-2026 01:31 AM
  1. అలారం మోగడంతో పారిపోయిన దుండగులు
  2. షాపులోని సీసీ కెమెరాల హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన ముఠా 
  3. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన

అబ్దుల్లాపూర్ మెట్, జూలై 6: జువెలరీ షాపులో చోరీకి యత్నించిన దుండగులు.. అలా రం మోగడంతో పారిపోయిన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో శ్రీ గణేష్ జువెలరీ షాప్‌లో దుం డగులు ఆదివారం అర్ధరాత్రి చోరీకి ప్రయత్నించారు. పక్కనే ఉన్న షాప్ గోడకు పెద్ద కన్నం పెట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా జువెలరీ షాపులో ఉన్న అలా రం మోగింది.

దొంగలు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలని షాపులోని సీసీ కెమెరాల హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లినట్టు తెలు స్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిం చారు. పక్క షాపుల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్ మెట్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు.