వికారాబాద్‌లో దారుణం.. సర్పంచ్ భర్తపై హత్యాయత్నం, పరిస్థితి విషమం!
యశోద హాస్పిటల్ కు తరలింపు ..
పరిస్థితి విషమం.
వికారాబాద్‌లో సర్పంచ్ భర్తపై దాడి జరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) లో సంచలనం రేపిన ఘటనలో సర్పంచ్ భర్తపై దారుణ దాడి జరిగింది. తీవ్ర గాయాలతో బాధితుడిని Hyderabadలోని యశోద ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గ్రామానికి చెందిన జంగం సంగయ్య స్వామి భార్య జంగం బసమ్మ సర్పంచ్ గా గెలుపొందారు.
వికారాబాద్ జిల్లా వార్తలు చూడండి
అయితే గత రాత్రి 10:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే వికారాబాద్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు సంగయ్య పై దాడి చేసిన వ్యక్తులను కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో తాజా క్రైమ్ వార్తలు చదవండి
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.






