24 April, 2026 | 11:52 AM

Breaking News

కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •   అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం   •   పాలేరులో ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్'   •  

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

24-04-2026 12:00 AM

మృతురాలి బంగారు కమ్మలు మాయం...?

జగిత్యాల, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ):జగిత్యాలలోని ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది.మృతురాలి బంగారు చెవి కమ్మలు ఆసుపత్రి సిబ్బంది మాయం చేశారని భాధితులు ఆరోపించారు.గురువారం ఆసుపత్రిలోబంగారు కమ్మలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జగిత్యాల పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి శాంతింపజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం జగిత్యాల ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు.చికిత్స పొందుతూ వృద్ధురాలు గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

అయితే మృతురాలికి చెందిన బంగారు చెవి కమ్మలు కనబడపోయేసరికి బాధితులు జగిత్యాల ఆసుపత్రికి చేరుకునిఆసుపత్రికి చెందిన ఇద్దరు మహిళా సిబ్బంది బంగారు కమ్మలు మాయం చేసారాని ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళన చేశారు.మా బంగారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆసుపత్రి అధికారులు,సిబ్బంది, బాధితులతో పోలీసులు మాట్లాడి ఆందోళనను విరామింపజేశారు.