3 March, 2026 | 11:28 AM

క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి

03-03-2026 12:04 AM

తాడ్వాయి, మార్చి 2 (విజయ క్రాంతి): క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని తాడువాయి ఎంపీ ఓ సవితరెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం ఆమె సెకండ్ ఎడిషన్ సీఎం కబ్ క్రీడలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్ విభాగాలలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం,నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందారు. ఈ క్రీడాకారులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాడువాయిని జాతీయస్థాయిలో నిలిపేలా కృషి చేయాలని ఆమె కోరారు. సీనియర్ ఫిజికల్ డైరెక్టర్‌లు సంగారెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.