3 March, 2026 | 6:42 AM

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి

03-03-2026 12:03 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 2(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా మంగ్రే ఆకాష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు అహ్మద్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్ష ణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ..

పట్టణ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చైర్మన్, వైస్ చైర్మన్‌లకు సూచించారు. మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్లను పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, బాలకృష్ణ, నాగుబాబు, సలాం బిన్ హైమద్, దూడల లక్ష్మి, జెభా షేక్ పాల్గొన్నారు.