3 June, 2026 | 2:06 AM

హనుమకొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో..

03-06-2026 12:05 AM

హనుమకొండ, జూన్ 2 (విజయ క్రాం తి): భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొల ను సంతోష్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీల క పాత్ర పోషించిన దివంగత కేంద్ర మాజీ మంత్రి  సుష్మా స్వరాజ్ ని స్మరించుకున్నా రు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమె పార్లమెంట్లో ఎంతో గట్టిగా, స్పష్టంగా మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ టీ. రాజేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు నేడు అధికారాన్ని అనుభవిస్తున్నార ని, తెలంగాణ రాష్ట్ర సాధనకు భారతీయ జనతా పార్టీ మొదటి నుండి సంపూర్ణ మ ద్దతు ఇచ్చిందని అన్నారు. మాజీ ఎంపీ  సీ తారాం నాయక్  మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రోజులను, విద్యార్థులు, ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఒక్కరి వల్ల రాలేదని, సమష్టి పోరాట ఫలితంగానే రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. కాళీ ప్రసాద్, పులి సరోత్తం రెడ్డి,రాష్ట్ర నాయకులు డా. విజయ్ చందర్ రెడ్డి, కందగట్ల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు రావు అమరేంద ర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ, గొట్టికొప్పుల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కూతురు రాజు, నర్మేట శ్రీనివాస్ ,  తోపుచర్ల అర్చన , రాధారపు శివ ,ఆకుల శ్రీకాంత్, జిల్లా కార్యదర్శులు అరణ్య రెడ్డి , కొండం రవీందర్ రెడ్డి , కార్యాలయ కార్యదర్శి సంపత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, మహిళా మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.