9 April, 2026 | 5:39 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా

09-04-2026 03:51 PM

గౌహతి: 126 స్థానాలు కలిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం నాడు కొనసాగుతుండగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జలుక్‌బారి నియోజకవర్గం నుండి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శర్మ, పోలింగ్ కేంద్రం నంబర్ 15 వద్ద తన ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి రినకి భూయాన్ శర్మ, పిల్లలు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రంలో వరుసగా మూడవసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు, సీఎం శర్మ తన సతీమణి రినికి భూయాన్ శర్మతో కలిసి గువహటిలోని కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.  దాదాపు 25 ఏళ్లుగా జలుక్‌బారి నియోజకవర్గం హిమంత బిశ్వ శర్మకు కంచుకోటగా కొనసాగుతోంది.