1 August, 2026 | 3:19 PM

అఖండ జ్యోతి కార్యక్రమానికి రండి

01-08-2026 02:18 PM

డిసిసి అధ్యక్షుని ఆహ్వానించిన ఆశ్రమ సభ్యులు 

బోథ్, ఆగస్ట్ 1 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహించనున్న శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమానికి రావలసిందిగా డిసిసి అధ్యక్షులు జాదవ్ నరేష్ ను ఆశ్రమ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. నెల రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తప్పనిసరిగా రావాలని ఆశ్రమ కమిటీ సభ్యులకు కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమ్మరి భోజన్న, ఆశన్న, భోజ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.