ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలి
* బుడగ జంగాల కాలనీలో అవగాహన సదస్సు
* గ్రామ సర్పంచ్ చిగురు నరేష్
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో సర్పంచ్ నరేష్ అధికారులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిగించారు. ఈ సందర్బంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ... వీబీజీ రాంజీ పథకం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
బోర్ రీఛార్జ్, ఇంకుడు గుంతలు,మొక్కల పెంపకం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం నిర్మించుకోవడానికి ఈ పథకం ద్వారా అవకాశం ఉందన్నారు. నూతన నిర్మాణం చేసుకునే ఇండ్లకు రిజిస్ట్రేషన్, విద్యుత్ మీటరు కల్గిఉండాలని పేర్కొన్నారు. ఇంటి పన్ను,నల్లా పన్ను సక్రమంగా చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉండేల పచ్చదనాన్ని కాపాడుతూ వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు వహించాలని కోరారు.
అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఇండ్లు లేక కట్టుకోవాలనుకునే వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా వారి పై ద్రుష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవ్య,8వ వార్డు సభ్యుడు వెంకట్ రెడ్డి, విద్యుత్ సిబ్బంది కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






