27 February, 2026 | 4:43 AM

కాళ్ళకుంట కాలనీలో మన ఊరు.. మన అంగన్వాడీ

27-02-2026 12:56 AM

కళాజాతలో వివరించిన కళాకారులు 

సిద్దిపేట ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అత్యంత కీలకమైన, మెరుగైన సేవలు అంగన్వాడి కేంద్రం ద్వారా అందుతున్నాయని సిద్దిపేట జిల్లా సంక్షేమ శాఖ అధికారి, సిద్దిపేట ఐసిడిఎస్ సిడిపిఓ శారద సూచించారు. గురువారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని కాళ్ళకుంట కాలనీలో క్రై ఆర్గనైజేషన్, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు, మన అంగన్వాడి కళాజాత కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ప్రజలకు అందుతున్న సేవలను మరింత విస్తరించేందుకు కళాకారులతో ఆట, పాట, మాటలతో వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం పిల్లలు పాడిన పాటలు అందరిని ఆకర్షింపజేశాయి.

5 సంవత్సరాల లోపు పిల్లలను కచ్చితంగా అంగన్వాడికి పంపించాలని, గర్భిణీ, బాలింతలు అంగన్వాడి కేంద్రంలోనే పౌష్టిక ఆహారం తీసుకోవాలని, గర్భం దాల్చిన ప్రతి మహిళ సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో నమోదు చేసుకోవాలని, పిల్లల ఎదుగుదలకు అంగన్వాడి ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌష్టిక ఆహారాన్ని అర్హులందరూ లబ్ధిపొందాలని కళాకారులు పాటల ద్వారా వివరించారు. అంగన్వాడి కేంద్రాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, సూపర్వైజర్ స్వప్న, బ్లాక్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, రిలయన్స్ ఫౌండేషన్ బ్లాక్ కో ఆర్డినేటర్ నవత, సిఆర్పి శ్వేత, అంగన్వాడీ టీచర్లు అరుణ, జ్యోతి, యమున, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.