8 April, 2026 | 3:30 AM

తిరుగు ప్రయాణమైన ఆర్టెమిస్

08-04-2026 01:34 AM

వ్యోమగాములకు ట్రంప్ అభినందనలు

మానవసహిత సుదూర ప్రాంత అంతరిక్ష యాత్రగా రికార్డు

వాషింగ్టన్, ఏప్రిల్ 7: భూమి నుంచి అ త్యంత సుదూర ప్రాంతానికి చేరిన మాన వ సహిత అంతరిక్ష యాత్ర ‘ఆర్టెమిస్ 2’ తిరుగు ప్రయాణం మొదలైంది. నాసా చేపట్టిన ఈ మిషన్ 1970 అపోలో 13 నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యోమగాముల బృందానికి అభినందనలు తెలిపారు. వ్యోమగాములు చరిత్ర సృష్టించారని అమెరికాకు అపారమైన గౌరవాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ఈ వ్యోమనౌక చంద్రుడి అవతలి వైపు వెళ్లినప్పుడు ఎలా అనిపించిందని ట్రంప్ ప్రశ్నించారు.

పైలట్ విక్టర్ గ్లోవర్ స్పందిస్తూ పరిశీలనలను నమోదు చేస్తూనే, దేవుడిని ప్రార్థించామన్నారు. ఈ యాత్రలో మరిచిపోలేని సంఘటన ఏమిటని అడగ్గా మరో వ్యోమగామి రీడ్ వైస్‌మాన్ స్పందిస్తూ అధ్యక్షుడి నుంచి సర్‌ప్రైజ్ కాల్ రావడం ప్రత్యేకమన్నారు. 1970 అపోలో 13 కూడా ఎన్నడూ చూడని దృశ్యాలను తాము చూశామని అ ద్భుతంగా అనిపించిందన్నారు. మిషన్ పూ ర్తయిన తరువాత వ్యోమగాములను వైట్‌హౌస్‌లో కలుస్తానని ట్రంప్ పేర్కొన్నారు.