15 June, 2026 | 2:50 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

గంజాయి విక్రేతల అరెస్ట్

24-11-2025 01:36 AM

150 గ్రాములు స్వాధీనం

మందమర్రి, నవంబర్ 23 : అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న గంగాదరీ పృధ్వీతేజ, ఎస్ కే గౌసియా, లను అరెస్టు చేసి వారి నుండి 150 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ కే శశిధర్ రెడ్డి తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మందమర్రి ఎస్‌ఐ రాజశేఖర్, రామకృష్ణా పూర్ పోలీస్ లు  కలిసి రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి సమీపంలో  పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అనుమానా స్పదంగా కనిపించారని, వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, మంచిర్యాల కు చెందిన ఎస్ కె. గౌసియా మహారాష్ట్ర లోని బల్లార్షా రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, పృద్వితేజకు విక్రయించగా,

పృద్వితేజ గంజాయిని యువతకు అమ్ముతున్నట్లు ఇద్దరు నిందితులు అంగీకరించారని ఈ మేరకు వారి నుండి గంజాయిని, 1500 నగదు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. యువత డ్రగ్స్ కు అలవాటుపడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మందమరి ఎస్సై ఎస్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.