16 May, 2026 | 9:34 PM

ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్టు

16-05-2026 08:42 PM

షాద్ నగర్ డీసీపీ సీహెచ్ శిరీష

షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణంలోని వివిధ కాలనీలలో, మేడ్చల్ లో ఇండ్ల తాళాలు విరగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు షాప్ దగ్గర పట్టణ పోలీసులు తెలిపారు. శనివారం షాద్‌నగర్‌ డీసీపీ శిరీష ఇందుకు  సంబందించిన వివరాలను వెలడించారు. డిసిపి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జిహెచ్ఆర్ కాలనీవాసి ప్రైవేట్ జాబ్ చేస్తున్న ముదిరాజు కులస్తుడైన కుక్కలి సురేష్ ఇదే నెల 7వ తేదీన తన భార్య ఆరోగ్యం బాగుగా లేనందువలన మధ్యాహ్నం ఒంటిగంటకు హాస్పిటల్ కు తీసుకువెళ్లి,

అక్కడినుండి తన భార్య గ్రామమైన చౌదరిగుడా మండలం వీరన్న పేట గ్రామంలో అమెను ఉంచి తిరిగి 9వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు తన ఇంటికి వచ్చి చూసుకుంటే గేటు తాళాలు వేసిన వేసినట్టే ఉండి, ఇంటి తాళం పగలగొట్టబడి మరియు రూమ్ తాళాలు పగలగొట్టబడి, బెడ్ రూంలో బీరువాలు తెరవబడి ఉన్నాయని, అందులో గల వస్తువులు చిన్న కమ్మలు 2 (గ్రాములు 2), చిన్న పిల్ల పోగులు 1 గ్రాము, చిన్నపిల్లల రింగ్ 1 గ్రాము మరియు  వెండి కడియాలు చిన్నపిల్లలవి 4 తులాలు, వెండి పట్ట గొలుసులు 25 తులాలు కనిపించలేవని, ఎవరో గుర్తుల వ్యక్తులు వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని చొరబడి పై వస్తువులు దొంగిలించారని

షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు వారు భారతీయ నాగరిక్ సురక్ష సెక్షన్లు  331(4), 305 కింద క్రైమ్ నెంబర్ 387/2026 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ, ఈరోజు సాంకేతిక సాక్షాదారాల ఆధారంగా రోహిత్ కుమార్, శివం సింగ్, సాగర్ కుమార్ రవిదాస్ అనే నిందితులను అరెస్టు చేసి విచారించగా 07 న రాత్రి 11 గంటల సమయం లో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిది లో దొంగతనము చేసిన హోండా షైన్ బైక్ నం. TS-11-ED-8674 మీద షాద్ నగర్ కు బయలుదేరి వచ్చి, అందజ1 గంటల సమయంలో షాద్ నగర్ లోని పరిగి రోడ్, జిహెచ్ఆర్  కాలనీ నందు ఇంటికి తాళము వేసి ఉన్న ఇళ్లను వెతుకుతూ, ఫిర్యాది దారుని ఇంటికి తాళము వేసి ఉన్నది గమనించి, చుట్టుపక్కల ఎవరు లేనిది చూసి అట్టి ఇంటి యొక్క తాళమును పగులగొట్టి, ఇంటి లోపలికి వెళ్ళి బెడ్ రూమ్ లో ఉన్న బీర్వ తాళము పగులగొట్టి అందులో

ఉన్న వస్తువులు బంగారు చిన్న కమ్మలు, బంగారు చిన్న పిల్లల పోగు ఒకటి, బంగారు చిన్న రింగు ఒకటి మరియు వెండి కడియాలు చిన్న పిల్లవి 4 జతలు, వెండి పట్టగొలుసులు తీసుకొని అక్కడి నుండి వచ్చిన బైక్ మీద పారిపోయినామని, అట్టి దొంగలించిన వస్తువుల నుండి బంగారు చిన్న పిల్లల పోగు ఒకటి,  బంగారు చిన్న రింగు ఒకటి మరియు వెండి కడియాలు చిన్న పిల్లవి 3 జతలను షాద్ నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తికి 40,000/- రూపాయలకు అమ్మేశామని, అమ్మగా వచ్చిన డబ్బులను ముగ్గురము సమానంగా పంచుకొని ఖర్చులకు వాడుకున్నామని తెలిపినట్లు, మిగిలిన వస్తువులు అయిన ఒక జత వెండి కాళ్ళ కడియాలు, ఒక జత వెండి కాళ్ళ పట్టీలు మరియు బంగారు చిన్న చెవి కమ్మలు తర్వాత ఎవరికైనా అమ్మి డబ్బులు తీసుకుందాము అని రోహిత్ వద్ద పెట్టినామని తెల్పినట్లు పోలీసులు వెల్లడించారు. పై కేసులతో పాటు షాద్ నగర్ పరిది లో మరో రెండు చోట్ల (ఫార్చునిస్ట్ కాలనీ, సీఎస్కే  రోడ్ న్యూ రాఘవేంద్ర కాలనీ) మరియు మేడ్చల్ పరిదిలో ఒక చోట ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసినామని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.