13 July, 2026 | 4:33 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయాలి

06-01-2026 07:04 PM

సుల్తానాబాద్ తాహసిల్దార్ బషీరుద్దీన్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులతో తహశీల్దార్ ఎండి బషీరుద్దిన్ మంగళవారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీ నుండి సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీ చేయడం జరిగింది.

జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం త్రాగు నీరు, పరిశుభ్రత, రహదారి, పార్కింగ్, నిరంతర విద్యుత్ సౌకర్యం, మెడికల్ టీమ్,  పోలీస్ భద్రత  మరియు ఇతర సౌకర్యాల పై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, ఎస్సై చంద్రకుమార్, సుల్తానాబాద్ మున్సిపల్ మేనేజర్ అలీ మొద్దీన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.