10 June, 2026 | 3:12 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

10-12-2025 07:34 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్..

వనపర్తి (విజయక్రాంతి): మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఖిల్లా గణపురం మండలంలో గురువారం పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అన్నారు. బుధవారం ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయల ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఘనపూర్ మండల పరిధిలో 27 సర్పంచి, 198 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు గాను పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తీసుకొని తరలివెళ్ళారు.

పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను తీసుకొని కేటాయించిన గ్రామ పంచాయతీకి రూట్ వారిగా బస్సులో తరలివెళ్ళారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండ, భయబ్రాంతులకు గురి కాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం ముందు ఫారం-9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తు పోస్టర్ అతికించాలని సూచించారు. తహసీల్దారు సుగుణ, ఎంపీడీవో విజయసింహారెడ్డి, తదితరులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.